ముసలి వయస్సు దాకా మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ..ఇదొక్కటే మా

updated: March 6, 2018 23:41 IST
ముసలి వయస్సు దాకా మీ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ..ఇదొక్కటే మా

ఆరోగ్యానికి వాకిళ్లు.. కళ్లు అనే విషయం మనకు తెలిసిందే. అతి సున్నితమైన ఈ కళ్లపై చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది.  పెద్ద వయస్సు వరకూ  మన కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవటానికి ఏమి చెయ్యాలి అంటే...ప్రముఖ కళ్ల వైద్య నిపుణుడు డాక్టర్ అలియు దవేర్ ..కలర్ ఫుల్ పళ్లు, కూరగాయాలు తీసుకోవటమే దీనికి పరిష్కారం అంటున్నారు.  ఇవి తీసుకునేవారి కళ్లు ఎంత వయస్సువచ్చినా చెక్కు చెదవరని అంటున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చగా ఉండే కూరగాయల్లో ఉండే లూటిన్ అనే న్యూట్రిన్స్ కళ్లకు చాలా మంచిదని తమ పరిశోధనలో తేలిందని ఆయన అన్నారు. చాల మంది ముసలితనం వచ్చింది..కళ్లు కనపడవు అని వాళ్లంతట వాళ్లే నిర్ణయించుకుంటారు కానీ అందుకు కారణం ..తాము అంతకాలం తీసుకున్న ఆహారమే అని గుర్తించరు అని అంటున్నారీ ఆప్తమాలజిస్ట్.

 

ఇక ఆకుపచ్చని కూరగాయలు తినేవారిలో కళ్లకు సంభందించిన సమస్యలు చాలా తక్కువగా రావటం తాము గమనించామని అన్నారు. వయస్సు సమస్యలతో, వెలుగుని ఎక్కువ సేపు చూడటం వంటి వాటితో రెటీనా సెల్స్ దెబ్బ తినకుండా కూరగాయల్లో ఉండే గ్రీనరీ కాపాడుతుందని చెప్పారు. వయస్సు పెరిగే కొలిదీ కంటిదగ్గర ఉండే కండరాలు బలహీనమవుతాయి అనీ, వాటిని ఆరోగ్యంగా ఉంచాలంటే రోజు వారి కూరగాయలతో ఆహారం తీసుకోవటమే పరిష్కారం అంటున్నారు.  కళ్లకోసం ఎ విటమిన్ ఉన్న టాబ్లెట్ల్ వంటివి తీసుకునే కన్నా చక్కగా మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మంచిదని అన్నారు.  

ముఖ్యంగా విటమిన్ ఎ ఓ పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది కంటి సమస్యలను పరిష్కరిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అయితే దీన్ని టాబ్లెట్ల రూపంలో  ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. స్మోకింగ్ చేసే వారిలో లంగ్ క్యాన్సర్ వచ్చే ముప్పు మరింత పెరుగుతుందని అమెరికాకు చెందిన నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ పరిశోధనలు చెబుతున్నాయి. కనుక విటమిన్ ఎ ట్యాబ్లెట్లను మోతాదుకు మించి తీసుకోరాదు. కానీ సహజ సిద్ధంగా విటమిన్ ఎ లభించే యాపిల్స్ వంటి పండ్లను తినవచ్చు. కూరగాయలు తినచ్చు.

Photo by Ahmed Carter on Unsplash

comments